Site icon HashtagU Telugu

Surya Karthik Subbaraju : సూర్య సినిమాకు దసరా కంపోజర్.. కార్తీక్ సుబ్బరాజు సూపర్ ప్లానింగ్..!

Surya Karthik Subbaraju Combination movie Santosh Narayanan Music Composer

Surya Karthik Subbaraju Combination movie Santosh Narayanan Music Composer

Surya Karthik Subbaraju కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం శివ డైరెక్షన్ లో కంగువ చేస్తున్న సూర్య ఆ సినిమాతో పాటు మరో రెండు భారీ సినిమాలను లైన్ చేస్తున్నాడు. అందులో కర్ణ సినిమా కూడా ఉంది. ఇక మరోపక్క కార్తీక్ సుబ్బరాజుతో కూడా మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు సూర్యతో ఒక డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణన్ ని లాక్ చేశారు. తమిళంలో సంతోష్ నారాయణన్ కంపోజింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా దసరా లాంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు సంతోష్. సూర్య, కార్తీక్ సుబ్బరాజు సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

సినిమా సినిమాకు డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న సూర్య రాబోతున్న సినిమాలతో ఫ్యాన్స్ అందరిని అలరించాలని చూస్తున్నాడు. కంగువ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుండగా సినిమాను నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అంతా సూపర్ అనేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సూర్య సినిమాల ప్లానింగ్ చూస్తే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ అందించడం పక్కా అని తెలుస్తుంది.

Also Read : NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. అక్కడ స్పెషల్ పార్టీ ప్లానింగ్..?