Surya Kanguva కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కంగువ. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. టైం ట్రావెల్ నేపథ్యంతో సూర్య రెండు డిఫరెంట్ రోల్స్ తో కంగువ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుందని తెలుస్తుండగా త్వరలో రిలీజ్ డేట్ లాక్ చేయనున్నారు.
సూర్య కంగువ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని తెలుస్తుంది. తెలుగులో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. అందుకే తెలుగులో కూడా కంగువ బిజినెస్ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సినిమా మేకర్స్ తెలుగు నుంచి 40 కోట్ల దాకా డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నారు. అయితే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ అంత పెడతారా లేదా అన్నది చూడాలి. సూర్య కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగులో సూర్య సినిమాకు డిమాండ్ ఉన్నా కంగువ మీద నిర్మాతలు అడిగినంత బడ్జెట్ పెడతారా లేదా అన్నది చూడాలి.
సూర్య కంగువ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. కంగువ మీద సూర్య ఫ్యాన్స్ మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు.
Also Read : Siddhu Jonnalagadda : టిల్లు బోయ్ తో సినిమా.. రెమ్యూనరేషన్ అంత ఇవ్వాల్సిందేనా..?