కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya,) కంగువ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కల్కి సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది.
జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బారాజ్ (Kartik Subbaraj) చేస్తున్న ఈ మూవీ గ్యాంగ్ స్టర్ కథతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్నా కూడా సినిమాలో మరో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పిందట.
పెళ్లి తర్వాత గ్లామర్ షో..
పెళ్లి తర్వాత ఒక పాప ఉన్నా కూడా గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు శ్రీయ (Shriya) శరణ్. ఐతే సూర్య 44 సినిమాలో శ్రీయ స్పెషల్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కార్తీక్ డైరెక్షన్ లో సూర్య చేస్తున్న కథ గ్యాంగ్ స్టర్ దే అయినా అందులో లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తుంది.
సూర్య 44 సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ బయటకు రావాల్సి ఉంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కంగువ రిజల్ట్ తో అసంతృప్తిగా ఉన్న సూర్య ఈసారి బ్లాక్ బస్టర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సూర్య సినిమా తప్పకుండా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పొచ్చు.
Also Read : Keerti Suresh : కీర్తి సురేష్ కాబోయే వరుడి గురించి ఈ విషయాలు తెలుసా..?