Nishad Yusuf : ప్రముఖ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించిన నిషాద్ యూసుఫ్ ఇక లేరు. సినిమా విడుదలకు మరో రెండు వారాల టైం మిగిలిన ప్రస్తుత తరుణంలో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మలయాళ సినిమాల్లో ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన 42 ఏళ్ల నిషాద్ యూసుఫ్.. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు కొచ్చిలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. ఆయన ఎలా చనిపోయారు ? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read :Military Theatre Commands : మన దేశానికి మూడు మిలిటరీ థియేటర్ కమాండ్లు.. ఎలా పనిచేస్తాయి ?
సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’కు ఎడిటర్‌గా నిషాద్ పనిచేశారు. నవంబర్ 14న(Nishad Yusuf) ఈ మూవీ విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన కంగువ మూవీ ఈవెంట్లో హీరోలు సూర్య, బాబీ దేవల్, ఇతర తారాగణంతో నిషాద్ ఫొటోలు దిగారు. వాటిని ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో పోస్ట్ చేశారు. తాను కంగువ మూవీ ఎడిట్ రూమ్‌లో ఏకాగ్రతతో పనిచేస్తున్న ఒక ఫొటోను కూడా నిషాద్ షేర్ చేశారు. ‘‘నవంబర్ 14న రిలీజ్ కానున్న కంగువ మూవీ కోసం 3డీ ఎఫెక్టుల వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. మీరంతా తప్పక ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అని ఆ పోస్టులో నిషాద్ రాసుకొచ్చారు. కంగువ మూవీలో సూర్య ద్విపాత్రాభినయం చేయగా, బాబీ దేవల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, యోగి బాబు తదితరులు నటించారు.
Also Read :Benefits Of Walking: ఒక గంటలో 5000 అడుగులు నడుస్తున్నారా? అయితే లాభాలివే!
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం మూవీ థల్లుమాలకు ఎడిటర్‌గా నిషాద్ వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. మమ్ముట్టి, సౌదీ వెల్లక్క నటించిన ‘ఉండ’ మూవీకి ఆయన చక్కటి ఎడిటింగ్ వర్క్‌ను అందించారు. థల్లుమాల మూవీకి ఉత్తమ ఎడిటింగ్ వర్క్‌ను అందించినందుకు నిషాద్కు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు లభించింది. మమ్ముట్టి నటించిన రాబోయే మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘బజూకా’కి కూడా నిషాద్ యూసుఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ మూవీ డిసెంబరులో రిలీజ్ కావాల్సి ఉంది.