Sachin And Suriya: క్రికెట్ లెజెండ్ సచిన్ తో సూర్య.. వైరల్ అవుతున్న ఫొటో!

ముంబైలో నటుడు సూర్య క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar)ను కలుసుకుని అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Suriya

Suriya

సినిమా (Cinema) స్టార్స్, స్టార్ క్రికెట్ ప్లేయర్స్ కలుసుకోవడం ఇటీవల సర్వసాధారణమవుతోంది. ఇప్పటికే ధోని పలు సినిమా స్టార్స్ తో జతకడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ్ సూపర్ స్టార్ సూర్య (Suriya) సచిన్ టెండూల్కర్ ను కలుసుకోవడం అటు క్రికెట్, ఇటు సినిమా వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ముంబైలో నటుడు సూర్య క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar)ను కలుసుకుని అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. అయితే, సూర్య తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఎక్కడ కలిశాడో వెల్లడించలేదు.

సచిన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసి ఆయనపై ప్రేమ, గౌరవం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు (Suriya). సూర్య నిర్మాతగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నాడు. సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ ‘సూరరై పొట్రు’ హిందీ రీమేక్‌ని నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భూమి పెడ్నేకర్‌తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మీడియా కథనాల ప్రకారం.. సూర్య (Suriya) హిందీ వెర్షన్‌లో కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సచిన్, సూర్య ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Dhoni Gift to Yogi Babu: యోగిబాబుకు ఎంఎస్ ధోని అదిరిపోయే గిఫ్ట్.. పిక్ వైరల్!

  Last Updated: 16 Feb 2023, 04:07 PM IST