Site icon HashtagU Telugu

Kanguva : భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సూర్య సినిమా.. ‘కంగువ’ రెడీ అవుతుంది..

Suriya Kanguva Movie Second Look Released

Suriya Kanguva Movie Second Look Released

సూర్య(Suriya) హీరోగా మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కంగువ(Kanguva). తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కలిసి దాదాపు 350 కోట్లతో కంగువ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటాని(Disha Patani) హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా కంగువ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా నేడు కంగువ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సూర్య రెండు పాత్రల్లో ఉన్నాడు. ఒకటి కొన్ని వందల ఏళ్ళ క్రితం పాత్ర, ఇంకోటి ప్రస్తుత పాత్రలా ఉంది.

చిత్రయూనిట్ కంగువ పోస్టర్ ని షేర్ చేసి.. డెస్టినీ టైం కంటే బలమైంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అని పోస్ట్ చేశారు. దీంతో కంగువ సినిమా మూడు కాలాల్లో నడిచే కథలా ఉండబోతుందని తెలుస్తుంది. సూర్య కూడా మూడు పాత్రల్లో కనపడబోతున్నాడు. సూర్య ఇలాంటి సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు సెకండ్ లుక్ రిలీజ్ చేయడంతో కంగువ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగువ లుక్ ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2024 సమ్మర్ తర్వాత కంగువ థియేటర్స్ లోకి రానుంది.

 

Also Read : Amitabh – Ayodhya : అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్.. డీల్ వివరాలివీ..