Site icon HashtagU Telugu

Kanguva – Game Changer : నవంబర్ లో సూర్య, డిసెంబర్ లో రామ్ చరణ్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్..

Suriya Kanguva and Ram Charan Game Changer Movies Release Dates Fixed

Kanguva Game Changer

Kanguva – Game Changer : రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కి వస్తుందని దిల్ రాజు చెప్పినా డేట్ మాత్రం చెప్పలేదు. అలాగే ఎలాంటి అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) గేమ్ ఛేంజర్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ రిలీజ్ డేట్ కూడా చెప్పేసాడు.

తమన్ తాజాగా తన ట్వీట్స్ లో.. అక్టోబర్ 1 నుంచి గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ మొదలు కాబోతుంది. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ కాబోతుంది. వచ్చే వారం నుంచి అప్పటి వరకు రెగ్యులర్ గా అప్డేట్స్, ఈవెంట్స్ ఉండబోతున్నాయి అని చెప్పి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.

ఇక తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటిసారి పీరియాడిక్ సినిమాగా కంగువాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కంగువా సినిమా దసరాకు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అదే సమయానికి రజినీకాంత్ వెట్టయాన్ సినిమా రిలీజ్ అవుతుండటంతో కంగువాని వాయిదా వేశారు. తాజాగా నేడు కంగువా సినిమాని నవంబర్ 14న రిలీజ్ చేస్తామని అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించారు.

దీంతో సెప్టెంబర్ లో దేవర, అక్టోబర్ లో వెట్టయాన్, నవంబర్ లో కంగువా, డిసెంబర్ లో గేమ్ ఛేంజర్.. ఇలా నాలుగు పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి.

 

Also Read : NTR – Atlee : అట్లీతో ఎన్టీఆర్ సినిమా.. ఆల్రెడీ కథ కూడా విన్నాను.. కానీ..