Site icon HashtagU Telugu

Suriya – Jyothika : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా ? ఇప్పుడు బాలీవుడ్‌లోనూ..!

Suriya Jyothika

Suriya Jyothika

Suriya – Jyothika : స్టార్ క‌పుల్ అనగానే సౌత్ మూవీ ఇండస్ట్రీలో సూర్య‌, జ్యోతిక దంపతులు గుర్తుకొస్తారు. పెళ్లయిన అనతికాలంలో విడాకులను తీసుకుంటున్న సెలబ్రిటీస్‌ను మనం ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటి వారి నడుమ సూర్య‌, జ్యోతిక దంపతుల అన్యోన్యత అమోఘం.  వివాహ బంధం విలువకు వారు నిలువెత్తు నిదర్శనం. గతంలో వారిద్దరు క‌లిసి ఎన్నో సినిమాలు తీశారు. పెళ్లైన త‌ర్వాత జ్యోతిక కొన్నేళ్లు మూవీస్‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ జంట‌ ముంబైలో ఉంటోంది. సూర్య, జ్యోతిక దంపతులు(Suriya – Jyothikas) అక్కడ దాదాపు రూ.70 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. పిల్ల‌ల్ని అక్క‌డి స్కూల్‌లో జాయిన్ చేశారు. ఇప్పుడు వీళ్ల ఆస్తుల వివ‌రాలు, రెమ్యున‌రేష‌న్ గురించి నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :TikTok Vs Facebook : ఫేస్‌బుక్‌ ప్రజల శత్రువు.. టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తే జరిగేది అదే : ట్రంప్

26 ఏళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి..

జ్యోతిక వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇటీవ‌ల ఆమె న‌టించిన ‘సైతాన్’ సినిమా హిట్ టాక్ అందుకుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫర్వాలేదు అనిపిస్తోంది. 1998లో ‘డోలీ సజాకే రఖ్నా’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జ్యోతిక 26 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

రూ.30 కోట్ల‌కు రెమ్యునరేషన్

సూర్య గ‌త ప‌దేళ్ల‌లో రూ.20 కోట్ల – రూ.25 కోట్ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుండ‌గా.. ఇప్పుడు దాన్ని రూ.30 కోట్ల‌కు పెంచిన‌ట్లుగా బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఆయ‌న కంగువాకి రెమ్యున‌రేష‌న్ పెంచార‌ని అంటున్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ‘కంగువా’, ‘స‌ర్ఫువా’ సినిమాల్లో సూర్య న‌టిస్తుండ‌గా, మ‌రికొన్ని హిందీ సినిమాల‌కి ఆయ‌న ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక జ్యోతిక ‘డ‌బ్బా కార్టిల్’ అనే సినిమాలో న‌టిస్తున్నారు.

Also Read :CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్