Site icon HashtagU Telugu

LEAKED: మహేష్ సినిమా వర్కింగ్ స్టిల్ లీక్…

Super Star Mahesh Babu

Mahesh Babu

LEAKED: చిత్ర పరిశ్రమలో లీకుల బెడద ఎక్కువైంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది. తాజాగా మహేష్ బాబు సినిమాలోని ఓ ఫోటో లీక్ అవ్వగా.. క్షణాల్లో ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఆ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతుంది. పూజాహెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది. నిజానికి ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 28న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే మహేష్ తల్లి మరణించడం, నెలల గ్యాప్ లోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అనంత లోకాలకు వెళ్లడంతో మహేష్ తీవ్ర దుఖంలోకి వెళ్లారు. వెంటవెంటనే తల్లిదండ్రులు మరణం మహేష్ ని తీవ్రంగా కలచివేసింది. దీంతో మహేష్ త్రివిక్రమ్ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఇక షూటింగ్ మొదలుపెడదామని అనుకున్న తర్వాత పూజాహెగ్డే కాలికి గాయం కావడంతో సినిమా ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఓ షాపింగ్ మాల్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఒక ఫోటో లీక్ అయింది .

మహేష్ సింగిల్ గా నిల్చుని ఉండగా… త్రివిక్రమ్ పూజాహెగ్డేకు స్టోరీ నేరేట్ చేస్తున్నాడు. ఆ సీన్ లో పూజ చాలా అందంగా కనిపిస్తున్నది. సీన్ ఏదైనా సరే ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడవ సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

Read More: Mahesh Babu: స్టైలిష్ లుక్ లో అమ్మాయిల కలల రాకుమారుడు.. ప్రిన్స్ మహేష్ కొత్త ఫోటోషూట్

Exit mobile version