Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన కూతురు సితారతో కలిసి ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్ ‘ట్రెండ్స్’ కోసం ఇటీవలే ఒక యాడ్ చేశారు. ఇందులో మహేశ్ బాబు లేటెస్ట్ గెటప్‌లో కనిపించారు. ఇప్పటిదాకా చాలా వాణిజ్య ప్రకటనల్లోనే మహేశ్ బాబు కనిపించారు. అయితే వాటిపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ తాజాగా ట్రెండ్స్ కోసం చేసిన యాడ్‌లో మహేశ్‌బాబు కనిపించడంపై డిస్కషన్ నడుస్తోంది. ఎందుకు ?
Also Read :Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి ఔట్.. ఇర్ఫాన్ కీలక ప్రకటన
మూవీ గెటప్ రివీల్ అయిపోతుందని..
దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ అంటేనే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) ధిక్కరించారనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.రాజమౌళి తాను ఏ హీరోతో సినిమా చేసినా, కొన్ని నియమాలు పెడతారు.సినిమా చిత్రీకరణ జరుగుతున్న వ్యవధిలో.. బయట ఎక్కువగా ఎక్స్ పోజ్ కాకూడదని, ఎక్కువగా ఫోటో షూట్స్ చేయకూడదని, యాడ్స్‌కు దూరంగా ఉండాలని రాజమౌళి చెబుతారట. ఇవన్నీ చేస్తే మూవీ గెటప్ రివీల్ అయిపోతుందని దర్శక ధీరుడు భావిస్తారట. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో, మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్‌ఎంబీ 29 (SSMB 29) మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2027లో, రెండో పార్ట్ 2029లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అంత సుదీర్ఘ కాలం పాటు కమర్షియల్ యాడ్స్‌కు మహేశ్‌బాబు దూరంగా ఉండటం అనేది కుదిరే పని కాదు. అందుకే ఆయన కూతురు సితారతో కలిసి ట్రెండ్స్ కోసం యాడ్ చేశారట.
Also Read :Jnanpith Award : వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్.. ఆయన నేపథ్యమిదీ
యాడ్‌లో ఇలా ఉంది..
‘ట్రెండ్స్’ కోసం చేసిన యాడ్‌ను ఇటీవలే సితార సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో రోజ్ కలర్ షర్ట్‌లో మహేష్ బాబు కనిపించారు. ‘‘షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా’’ అంటూ మహేష్ బాబు రాగానే.. ‘‘ అవును నాన్న’’ అంటూ మహేష్ బాబుపై సితార ఓ డ్రెస్ విసిరింది. ఆ వెంటనే మహేష్ బాబు కాస్ట్యూమ్ మారిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు బట్టలు విసురుతూ కొత్త కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోయారు. ఈ యాడ్‌లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్‌లో కనిపించారు.