Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కమల్ హాసన్.. వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో..

నవంబర్ 15న కృష్ణ మొదటి వర్ధంతి వస్తుండటంతో విజయవాడలోని వైసీపీ నాయకులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Super Star Krishna Statue Unveil by Kamal Haasan in Vijayawada

Super Star Krishna Statue Unveil by Kamal Haasan in Vijayawada

దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ(Krishna) విగ్రహాన్ని తాజాగా విజయవాడలో(Vijayawada) వైసీపీ(YCP) నేత దేవినేని అవినాష్(Devineni Avinash) ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. నవంబర్ 15న కృష్ణ మొదటి వర్ధంతి వస్తుండటంతో విజయవాడలోని వైసీపీ నాయకులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) రావడం విశేషం. ప్రస్తుతం కమల్ హాసన్ విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్ లో ఉన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ దగ్గరుండి నిర్వహించారు.

ఇక కమల్ హాసన్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కమల్ కి, దేవినేని అవినాష్ కి థ్యాంక్స్ చెప్తూ మహేష్ బాబు ట్వీట్ కూడా చేశారు.

Also Read : Anil Ravipudi Raviteja మాస్ రాజాతో అనిల్ ఫిక్స్.. రాజా డబుల్ గ్రేట్ లైన్ చేస్తారా..?

  Last Updated: 11 Nov 2023, 06:43 AM IST