Site icon HashtagU Telugu

Sunil: బాబోయ్ విలన్ గా సునీల్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?

Sunil

Sunil

Sunil స్టార్ కమెడియన్ సునీల్ ఇప్పుడు విలన్ గా సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. కేవలం తెలుగు సినిమాలే కాదు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా సునీల్ ఆఫర్లు అందుకుంటున్నాడు. సునీల్ సినిమాలో ఉంటే కలిసి వస్తుంది అన్న సెంటిమెంట్ బలంగా పడింది. అందుకే వరుస అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే సునీల్ విలన్ గా తెలుగులో అదరగొడుతుండగా తమిళంలో కూడా క్రేజీ ఛాన్సులు వస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమాలో తన పాత్రని బట్టి రెమ్యునరేషన్ తీసుకునే సునీల్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న దాని కన్నా ఇప్పుడు విలన్ గా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ కి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. విలన్ వేశాలకు ఐదు కోట్లా అని ఆశ్చర్యపోవచ్చు. సునీల్ కి ఉన్న స్టార్ క్రేజ్ ని అది వాలిడే అని చెప్పొచ్చు.

సునీల్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ పుష్ప 2 లో మంగళం శ్రీను పాత్రలో మరోసారి అదరగొట్టబోతున్నాడు సునీల్. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా సునీల్ తన కెరీర్ మళ్లీ ఊపందుకునేలా చేసుకున్నాడు. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంటే సునీల్ పాన్ ఇండియా రేంజ్ లో నెగిటివ్ రోల్స్ చేస్తూ పాపులర్ అవుతున్నాడు. సునీల్ ఇదే ఫాం మరికొన్నాళ్లు కొనసాగించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Kalki Tickets : ప్రభాస్ కల్కి బదులు రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్నారు..?