Ooru Peru Bhairavankona 3 Days Collections యువ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన వసూళ్ల తో అదరగొట్టేస్తుంది. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ నటించింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ డే 3 కోట్ల గ్రాస్ రెండు రోజుల్లో 7 కోట్ల దాకా వసూళ్లు రాబట్టగా 3 రోజుల్లో 20.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సందీప్ కిషన్ ఊరుపేరు భైరవ కోన సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రిలీజ్ కు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. వాటి ద్వారానే రిలీజ్ ముందే కోటి దాకా వసూళ్లను రాబట్టింది సందీప్ కిషన్ సినిమా.
ఊరు పేరు భైరవ కోన సినిమాతో సందీప్ కిషన్ ఎట్టకేలకు సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమా మీద ఉన్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుంచే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. సినిమా కు అప్పటి నుంచే పాజిటివ్ టాక్ రాగా రిలీజ్ తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఫైనల్ గా సినిమా 3 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ తో దూసుకెళ్తుంది. పోటీగా సినిమాలేఇ లేవు కాబట్టి ఊరు పేరు భైరవ కోన మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Also Read : NTR Devara : దేవర ఒక్కరు ఇద్దరు కాదా ముగ్గురా..?