Site icon HashtagU Telugu

Sundeep Kishan : నైజాంలో దూసుకెళ్తున్న భైరవకోన.. 4 రోజుల్లో 5 కోట్లు సూపర్ జోష్..!

Sundeep Kishan Ooru Peru Bhairavakona Nizam 4 Days Collections

Sundeep Kishan Ooru Peru Bhairavakona Nizam 4 Days Collections

Sundeep Kishan సందీప్ కిషన్ హీరోగా వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఊరు పేరు భైరవ కోన. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణంలో హాస్యం మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. రిలీజ్ ముందే సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ కాగా లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

3 రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా నైజాం లో 4 రోజుల్లో 5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. నైజాం లో సినిమా మంచి సక్సెస్ అందుకుందని తెలుస్తుంది. ఓవరాల్ గా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఊరు పేరు భైరవ కోన సినిమా వసూళ్లు బాగున్నాయి.

సందీప్ కిషన్ కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ సరైన హిట్ దక్కలేదు. ఊరు పేరు భైరవ కోన సినిమా తో మంచి టాక్ తెచ్చుకున్నారు. ఫిక్షనల్ స్టోరీతో వి.ఎఫ్.ఎక్స్ ప్రధానంగా సాగిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Also Read : Tillu Square Theatrical Business : టిల్లు స్క్వేర్ బిజినెస్.. మైండ్ బ్లాక్ చేస్తున్న సిద్ధు.. టైర్ 2 హీరోగా ప్రమోట్..!