Summer 2024 : ప్రభాస్ ఒక్కడే.. మిగతా అంతా వాళ్లే..!

Summer 2024 సమ్మర్ స్టార్ సినిమాలతో బాక్సాఫీస్ హడావిడు ఉంటుందని అనుకుంటే సడెన్ గా స్టార్స్ అంతా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోగా యంగ్ హీరోల సినిమాలే ఈ సమ్మర్ ని ఆక్యుపై

Published By: HashtagU Telugu Desk
Summer 2024 Prabhas Kalki Vijay Devarakonda Family Star Siddhu Jonnalagadda Tillu Square Viswak Sen Gog

Summer 2024 Prabhas Kalki Vijay Devarakonda Family Star Siddhu Jonnalagadda Tillu Square Viswak Sen Gog

Summer 2024 సమ్మర్ స్టార్ సినిమాలతో బాక్సాఫీస్ హడావిడు ఉంటుందని అనుకుంటే సడెన్ గా స్టార్స్ అంతా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోగా యంగ్ హీరోల సినిమాలే ఈ సమ్మర్ ని ఆక్యుపై చేశాయి. అయితే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ కి స్టార్ సినిమా భారీ బడ్జెట్ సినిమా కల్కి ఒక్కటే అని చెప్పొచ్చు. మార్చి నెల ఆఖరి నుంచే సిద్ధు టిల్లు స్క్వేర్ తో సమ్మర్ సినిమాల హంగామా మొదలు పెడుతున్నాడు.

ఈ సమ్మర్ లో కల్కి తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు వస్తున్నాయి. ఈ ఇద్దరి హీరోలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వస్తుండగా.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 1980 కాలం నాటి కథతో మరోసారి తన మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు.

వీరితో పాటుగా సుధీర్ బాబు హరోం హర సినిమా కూడా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. అల్లరి నరేష్ ఆ ఒకక్టి అడక్కుతో పాటుగా రాం డబుల్ ఇస్మార్ట్ కూడా ఈ సమ్మర్ రేసులో ఉంటుందని టాక్. మొత్తానికి ప్రభాస్ ఒక్కడే తప్ప మిగతా అంతా యువ హీరోలతోనే ఈ సమ్మర్ ముగిసేలా ఉంది. కల్కి ప్రభావం ఎంత ఉంటుందో కానీ ఈ సమ్మర్ కి ఈ యంగ్ హీరోల సినిమాల సత్తా మాత్రం చూపించాల్సి ఉంటుంది.

Also Read : Sapta Sagaralu Dati Side B : ప్రైం వీడియోలో మిస్సైన సప్త సాగరాలు సైడ్ బి.. కారణాలు ఏంటి..?

  Last Updated: 23 Mar 2024, 03:53 PM IST