Site icon HashtagU Telugu

Indian2: శంకర్ కు షాక్ ఇచ్చిన సుకుమార్, ఇండియన్2 రిలీజ్ కు చిక్కులు

1

1

దర్శకుడు శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2, రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ అనే రెండు చిత్రాల పనిలో బిజీగా ఉన్నాడు. మూలాల ప్రకారం.. శంకర్ ఇండియన్ 2ని ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని విడుదల చేయాలనుకున్నాడు. అయితే పుష్ప: రూల్ మేకర్స్ చాలా ముందుగానే విడుదల తేదీని విడుదల చేశారు.

దీంతో డైరెక్టర్ శంకర్‌కు బిగ్ షాక్ తగిలింది. దీంతో శంకర్ ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం వెతకాలి. లేదంటే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పుష్ప 2తో టగ్ ఆఫ్ వార్‌కు వెళ్లాలి. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’ కూడా 2024 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. అయితే ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల కానుండటంతో  శంకర్ తన సినిమా విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబుతున్నాడో అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కాగా పుష్ప 2 మూవీ రిలీజ్ చేయటం వెనక డైరెక్టర్ సుకుమార్ పెద్ద ప్లానే వేశాడు. మూవీ రిలీజ్ ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారం వీకెండ్. సోమవారం రక్షా బంధన్ ఉంది. ఇలా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. కాబట్టి పుష్ప 2 సినిమాని ఈ డేట్ లో రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు దక్కే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read: Jobs: 20 న తొర్రూర్ లో జాబ్ మేళా