Jagadam : ఆ స్టార్ హీరోలతో అనుకున్న ‘జగడం’.. కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల రామ్‌తో..

సుకుమార్ మొదటి సినిమా 'ఆర్య' సూపర్ హిట్ తరువాత.. ఒక యాక్షన్ మూవీ చేద్దామని అనుకున్నాడు. ఈక్రమంలోనే మహేష్ బాబు (Mahesh Babu) ని దృష్టిలో పెట్టుకొని ఒక కథని రాసుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Sukumar Ram Pothineni Jagadam Movie first wants to take with those Star Heros

Sukumar Ram Pothineni Jagadam Movie first wants to take with those Star Heros

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ ‘జగడం'(Jagadam). సుకుమార్ మొదటి సినిమా ‘ఆర్య’ సూపర్ హిట్ తరువాత.. ఒక యాక్షన్ మూవీ చేద్దామని అనుకున్నాడు. ఈక్రమంలోనే మహేష్ బాబు (Mahesh Babu) ని దృష్టిలో పెట్టుకొని ఒక కథని రాసుకున్నాడు. స్టోరీ పూర్తి అయిన తరువాత మహేష్ తో ఆ సినిమా చేయడం సాధ్య పడలేదు.

దీంతో తన మొదటి హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తోనే.. ఆ కథని తెరకెక్కించాలని భావించాడు. ఈక్రమంలోనే నిర్మాతకు కూడా కథని వినిపించాడు. అయితే దిల్ రాజు(Dil Raju) కథలో కొన్ని మార్పులు అడిగాడట. మొదటి సినిమా ‘ఆర్య’ కథ చెప్పినప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. జగడం విషయంలో కూడా అలానే ఉంటుందని అనుకున్నాడట సుకుమార్. అయితే జగడం కథపై నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుకుమార్ కి బాగా కోపం వచ్చింది.

అంతే రాత్రికి రాత్రే హీరో రామ్‌ని కలిసి కథ చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. ఈ ఓపెనింగ్ కి దిల్ రాజు, అల్లు అర్జున్ ని కూడా పిలిచాడు. అక్కడకి వచ్చిన దిల్ రాజు, సుకుమార్‌తో.. “కోపం వస్తే మరి ఇలా చేసేస్తావా..?” అంటూ ప్రశ్నించాడట. బన్నీ కూడా సుకుమార్‌ని.. ‘ఏంటి ఇలా చేశావు’ అని ప్రశ్నించాడు. ఇక ఇదంతా తన అమాయకత్వంతో చేసిన తప్పు అని కొన్నాళ్ళకు సుకుమార్ కి అర్ధమైనట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇక 2007లో రిలీజ్ అయిన ‘జగడం’ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ప్లాప్ గా నిలిచినా విమర్శకులని మెప్పించింది. ఇప్పటికి ఈ సినిమాలోని కొన్ని సీన్స్ బాగా పాపులర్. డైరెక్టర్ రాజమౌళికి కూడా ఈ సినిమాలోని హీరో ఎలివేషన్స్ అంటే ఇష్టం అని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.

 

Also Read : Miss Shetty Mr Polishetty : అందరికంటే ముందే ఆ సినిమా చూసేసిన చిరంజీవి.. రివ్యూ కూడా ఇచ్చేశారుగా..

  Last Updated: 05 Sep 2023, 09:22 PM IST