అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం పాట్నా(Patna)లో గాంధి మైదాన్ లో జరగనుంది. యువి మీడియా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తుంది. ఇప్పటికే నార్త్ సైడ్ నుంచి ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడగా సినిమాకు భారీ ఓపెనింగ్స్ కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ వేడుక పాస్ ల కోసం ఆడియన్స్ చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే సినిమా రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉంది.
ఐతే నేడు జరగనున్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ (Sukumar) అటెండ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది. సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయడం కోసం సుకుమార్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటికే రెడీ కాగా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ నడుస్తుంది.
సుకుమార్ మిస్..
పుష్ప 2 (Pushpa 2) ని అనుకున్న టైం కు రిలీజ్ చేయాలంటే సుకుమార్ ఇంకా పనిచేయాల్సి ఉంది. అందుకే నేడు జరిగే ఈవెంట్ కు సుకుమార్ మిస్ అవుతారని తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్ (Allu Arjun) స్పీచ్ తో పాటు మిగతా స్టార్ కాస్ట్ ఇంకా టెక్నిషియన్స్ స్పీచ్ తో వేడుక జరగనుంది.
పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హంగామా చూసి నేషనల్ మీడియా సైతం అవాక్కవుతుంది. ఈ లెక్కన పుష్ప 2 డిసెంబర్ 5 నుంచి బాక్సాఫీస్ రూలింగ్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.
Also Read : Varun Tej : వరుణ్ తేజ్ కి సినీ పరిశ్రమలో ఆ హీరో ఒక్కడే ఫ్రెండ్ అంట.. ఎవరా హీరో?