ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan).. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ (Tollywood) లో బాగా వినిపిస్తున్న పేరు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ (Sujeeth) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీలో హీరోయిన్ గా క్రేజీ ఆఫర్ (Offer) కొట్టేసింది. అయితే ఈ బ్యూటీ కేవలం తెలుగులో రెండు అంటే రెండే సినిమాలు చేసింది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం మూవీలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నటనకు మంచి మార్కులే పడ్డా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఉన్నట్టుండి పవర్ స్టార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రియాంక కు అంత పెద్ద ఆఫర్ ఎలా వచ్చింది? అంటూ సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
చేసిందే రెండు సినిమాలు అయినా.. అందులోని హోమ్లీ నటన, ప్రియాంక భావాలు సుజిత్ ను కట్టిపడశాయట. ఆ రెండు సినిమాల్లో ప్రియాంక నటనను చూసి సుజిత్ భారీ ఆఫర్ ఇచ్చాడట. కానీ ఆమె అందాలకు ఫిదా అయ్యాడు కాబట్టే ప్రియాంకకు అంత పెద్ద ఆఫర్ ఇచ్చాడని టాలీవుడ్ మరో టాక్ వినిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ మూవీతో ఒక్కసారిగా ట్రెండింగ్ లో దూసుకువచ్చింది ప్రియాంక. ఈ బ్యూటీని బుక్ చేసుకునేందుకు ఇతర నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తన ప్రయారిటీ పవన్ మూవీకే అంటోంది ఈ బ్యూటీ (Priyanka Mohan)
Also Read: Hello Alexa: అలెక్సా అదుర్స్.. పిల్లల్లో పెరుగుతున్న కమ్యూనికేషన్!