Site icon HashtagU Telugu

Prashanth Neel : సుహాస్ కొత్త సినిమా వచ్చిన కోసం ప్రశాంత్ నీల్.. ఎందుకు?

Suhas New Movie Opening by Salaar Director Prashanth Neel

Suhas New Movie Opening by Salaar Director Prashanth Neel

యూట్యూబ్ స్టార్ సుహాస్(Suhas) ఇప్పుడు హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన సుహాస్ చేతిలో ఇప్పటికే హీరోగా ఆరు సినిమాలు ఉన్నాయి. అవే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా నేడు సుహాస్ మరో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఓపెన్ అయింది.

సుహాస్ హీరోగా, సంగీర్తన హీరోయిన్ గా, కొత్త దర్శకుడు సందీప్ బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణంలో హర్షిత్, హన్షిత రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు బేబీ ఫేమ్ విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలు జరుపుకోగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel ), అనిల్ రావిపూడి, బలగం వేణు గెస్టులుగా వచ్చారు. ప్రశాంత్ నీల్ హీరో హీరోయిన్స్ పై క్లాప్ కొట్టారు. కోర్ట్ రూమ్ కామెడీ ఎమోషన్స్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

అయితే సుహాస్ కోసం ప్రశాంత్ నీల్ రావడమేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆరా తీస్తే ఈ సినిమా దర్శకుడు సందీప్ బండ్ల గతంలో ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేశాడని, అతను పిలవడంతో నీల్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ప్రశాంత్ నీల్ సుహాస్ కోసం రావడంతో ఈ సినిమాపై కూడా అందరి దృష్టి పడింది.

Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ గొడవలో ఇద్దరు అరెస్ట్.. A1 గా పల్లవి ప్రశాంత్, మరికొంతమందిపై కేసులు..