ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) సినిమాల పరంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కావట్లేదు. లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో రైటర్ కం యాక్టర్ హర్షవర్ధన్ డైరెక్షన్ లో మామాం మశ్చీంద్ర సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నారు.
సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ట్రైలర్ (Mama Mascheendra Trailer) ఈరోజు రిలీజైంది. ఈ ట్రైలర్ ని మహేష్ రిలీజ్ చేయగా చిత్రయూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఇక మామా మశ్చీంద్ర సినిమా గురించి మహేష్ తో సుధీర్ బాబు డిస్కస్ చేయగా మూడు పాత్రలు ఒక క్యారెక్టర్ కోసం బాగా బరువు పెరిగా అని అంటే అది విని మహేష్ (Mahesh Babu) కంగారు పడ్డారని. అంతేకాదు ఇదివరకు ఇలా సినిమాలో పాత్ర కోసం బరువు పెరిగిన కొంతమంది గురించి తనతో చర్చించారని చెప్పారు సుధీర్ బాబు.
మూడు విభిన్న పాత్రల్లో నటించిన సుధీర్ బాబు (Sudheer Babu) సినిమా కోసం బాగా కష్టపడినట్టు చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్ గారు అంటే తనకు చాలా ఇష్టమని తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ సినిమాలు ఇచ్చే అరుదైన దర్శకుల్లో ఆయన ఒకరని ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు సుధీర్ బాబు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగానే ఉండగా ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.
Also Read : Raviteja : సంక్రాంతి బరిలో ‘ఈగల్’ ..