Site icon HashtagU Telugu

The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంపై ఇన్ఫోసిస్ చీఫ్ సుధామూర్తి రివ్యూ

The Vaccine War

The Vaccine War

The Vaccine War: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. ఈ చిత్రం ఈ నెల సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.తాజాగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి మాట్లాడారు.

ది వ్యాక్సిన్ వార్ కథ, కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే అద్భుతంగ ఉందన్నారు. కంటెంట్‌తో పాటు అందులోని సందేశం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అభిప్రాయపడ్డారు. సుధా మూర్తి ఇంకా మాట్లాడుతూ పిల్లలను పెంచేటప్పుడు ఒక మహిళ తన కెరీర్‌పై దృష్టి పెట్టడం అంత సులభం కాదు. ఆమెకు కుటుంబం నుంచి సపోర్ట్ అవసరమని చెప్పారు. ప్రతి స్త్రీ విజయం వెనుక ఆమెను అర్థం చేసుకునే భర్త తప్పకుండా ఉంటాడని చెప్పారు. ఇక చిత్రంలో కూడా ఇదే చూపించారని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో తన కుటుంబాన్ని విడిచిపెట్టి, ల్యాబ్‌లో గంటల తరబడి గడిపిన మహిళ శాస్త్రవేత్త ప్రయాణాన్ని ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చూపించారని ఆమె అన్నారు. కోవిడ్-19 నుండి బయటపడేందుకు ఇలాంటి వ్యాక్సిన్‌ను తయారు చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకుని కుటుంబానికి దూరంగా ఉంటూ ల్యాబుల్లోనే ఎక్కువగా గడిపారని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో మనం సుఖంగా జీవించేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడతారని సుధామూర్తి అన్నారు. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన ఈ చిత్రాన్ని రూపొందించినందుకు వివేక్ అగ్నిహోత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Drugs Case : డ్ర‌గ్స్ కేసులో నటుడు నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారుల సోదాలు