పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu ) సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాల్లో నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది శ్రేణులు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయగా, విడుదలైన వెంటనే గ్రాఫిక్స్, విజువల్స్‌పై నెగిటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు పవన్ దృష్టికి చేరాయి. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ తీవ్ర విమర్శల మధ్య కూడా ధైర్యంగా నిలిచే తాను ఎప్పుడూ అభిమాని బలంతో ముందుకు సాగుతానని చెప్పారు.
విమర్శలతో తాను క్షీణించను అని స్పష్టం చేసిన పవన్ (Pawan), “నాకు డిప్రెషన్ ఉండదు… బ్రతకడం అంటేనే సక్సెస్” అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్‌కు భయపడే వ్యక్తిని కాదని, నెగిటివ్ మాటలు వినిపిస్తే, వాటిని తాను బలంగా సూచనగా తీసుకుంటానన్నారు. సినిమాపై బాయ్‌కాట్ అంటుంటే “చేసుకోండి” అని ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో తన నమ్మకం, భక్తి, ధైర్యం స్పష్టంగా కనిపించాయి.
Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
సినిమాలో వచ్చిన గ్రాఫిక్స్ విమర్శలపై కూడా పవన్ నిగూఢంగా స్పందించారు. “విజువల్స్ లో లోపాలుంటే వాటిని అంగీకరిస్తా, పార్ట్ 2లో తప్పక సరిచేస్తాం” అని చెప్పారు. టెక్నికల్ అంశాల్లో ఎప్పుడూ మెరుగుదలకే అవకాశం ఉందని ఆయన వివరించారు. అభిమానులు విమర్శలు ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండాలని కోరారు. “మీరు తేలికగా ఉండండి, దెబ్బలు తినేది నేను కదా” అంటూ అభిమానులకు ధైర్యాన్ని నూరిపోశారు.
పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను వ్యక్తిగతంగా తన గురించి కాదు, భారతీయ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా అని స్పష్టం చేశారు. కోహినూర్ వజ్రం కన్నా గురువుల ద్వారా వచ్చిన జ్ఞానం మన సివిలైజేషన్‌కు అసలైన సంపద అని చెప్పారు. ఇది ఒక్కరు లేదా ఇద్దరిపై కాక, ఒక నాగరికతపై, ఓ దేశపు ధర్మ విశ్వాసాలపై తీసిన సినిమా అని అన్నారు. ‘‘నెగిటివ్ మాటలు వస్తే స్పందించండి, దమ్ముంటే తిరిగి కొట్టండి’’ అనే పవన్ వ్యాఖ్యలు అభిమానులకు కొత్త ఊరటనిచ్చాయి.