Site icon HashtagU Telugu

Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి

mangli

Resizeimagesize (1280 X 720) 11zon

టాలీవుడ్ ప్రముఖ గాయని (Tollywood Singer) మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి పండుగ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాల్గొన్నారు. అయితే పాల్గొని తిరిగి వెళ్తుండగా.. కొందరు ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని హాజరయ్యారు.

అయితే తొలిరోజు వేడుకల్లో భాగంగా.. సింగర్ మంగ్లీతో పాటు కొందరు గాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. బళ్లారి ఉత్సవాల్లో గాయని మంగ్లీ వేదికపై పాటలు పాడారు. తిరుగు ప్రయాణంలో ఆమెను చూసేందుకు స్థానిక యువకులు ముందుకు వచ్చారు. వేదిక వెనుకనున్న మేకప్ టెంట్‌లోకి ప్రవేశించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు.

Also Read: Nine Killed: అమెరికాలోని మరోసారి కాల్పుల మోత.. 9 మంది మృతి

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా మంగ్లీ పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ప్రముఖ యాంకర్ అనుశ్రీ మంగ్లీని కన్నడలో మాట్లాడమని కోరింది. అందరికీ తెలుగు తెలుసునని మంగ్లీ చెప్పలేదు. యాంకర్ బలవంతం చేస్తే కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగ్లీ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆమెకు కన్నడలో ఎందుకు అవకాశం ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.