Shruthi Hassan కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఆమధ్య కొన్నాళ్లు చాలా ఖాళీగా ఉంది. అయితే సడెన్ గా అమ్మడి కెరీర్ ఊపందుకుంది. శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న కారణంగా అమ్మడు ఆ షూటింగ్ స్పాట్ కి చేరుకునేందుకు ఆటోలో వెళ్లినట్టు తెలుస్తుంది. అదేంటి శృతి హాసన్ ఏంటి ఆటోలో వెల్లడం ఏంటని అనుకోవచ్చు.
ముంబైలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యిందట. అయితే షూటింగ్ కు లేట్ అవుతున్న కారణంగా కారు దిగి ఆటోలో సెట్స్ కు వెళ్లిందట శృతి హాసన్. ఒకప్పుడు శృతి హాస్న్ డేట్స్, టైమింగ్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ఐతే ఇప్పుడు శృతి హాసన్ పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తుంది.
ఒకప్పుడు శృతి హాసన్ లానే అమితాబ్ బచ్చన్ కూడా ముంబైలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోగా షూటింగ్ కు లేట్ అవుతుందని కారుని డ్రైవర్ ని తీసుకురమ్మని ఆయన బైక్ మీద వెళ్లారు. సో వర్క్ మీద వారికి ఉన్న డెడికేషన్ అలాంటిది కాబట్టే వారంతా గొప్ప స్థాయిలో ఉన్నారని అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో అడివి శేష్ తో డెకాయిట్ సినిమాలో నటిస్తుంది. ఈమధ్యనే తమిళంలో లోకేష్ కనకరాజ్ తో ఇనిమేల్ వీడియో సాంగ్ చేశారు. ఆ సాంగ్ మంచి సక్సెస్ అయ్యింది.
Also Read : Divya Bharathi : దివ్య భారతి అందాల జాతర.. చూపు తిప్పుకోనివ్వని అమ్మడు..!