Balakrishna Krack: ‘క్రాక్’ మిస్ అయ్యాడు.. వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు!

బాలయ్య బిజీగా ఉండటం వల్ల రవితేజకి చెప్పి క్రాక్ మూవీని లాక్ చేశారట. ఆ తర్వాత వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు బాలయ్య.

  • Written By:
  • Updated On - February 11, 2023 / 02:10 PM IST

రెండేళ్ల క్రితం థియేటర్స్ లోకి సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన రవితేజ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ (Krack) వెనుక కూడా మరో హీరో ఉన్నాడు. ఆయనే బాలయ్య. అవును గోపీచంద్ మలినేని ముందుగా క్రాక్ కథను బాలయ్యతోనే చేయాలని అనుకున్నాడట. సి. కళ్యాణ్ నిర్మాణంలో ప్రాజెక్ట్ అనుకొని ఫైనల్ గా ఆ టైమ్ లో బాలయ్య (Balakrishna) బిజీగా ఉండటం వల్ల రవితేజ (Ravi Teja)కి చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడట. ఇక హీరోతో పాటు నిర్మాత కూడా మారాడు.

‘క్రాక్’ కథ ముందు బాలయ్య తో అనుకున్నామని గోపీచంద్ ఎక్కడా చెప్పింది లేదు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ బయటపెట్టాడు. కళ్యాణ్ నిర్మించిన ఓ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్ మలినేని. గోపి గురించి కళ్యాణ్ మాట్లాడుతూ మా కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో కుదర్లేదని చెప్పుకున్నాడు. మొన్న సంక్రాంతికి బాలయ్యతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ కాంబో సినిమా నేను చేయాల్సింది. కానీ అది మరొకరికి రాసి పెట్టి ఉంది.

బాలయ్య (Balakrishna) తో ఆ టైమ్ లో క్రాక్ కథ అనుకున్నాం. కానీ అప్పుడు బాలయ్య డేట్స్ కుదరకపోవడం మరో ప్రాజెక్ట్ తో బిజీ గా ఉండటం చేత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అలా బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను నేను మిస్సయ్యానని చెప్పాడు కళ్యాణ్. గోపీచంద్ మలినేని బాలయ్యతో (Balakrishna) క్రాక్ అనుకొని ఇప్పుడు వీర సింహా రెడ్డితో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Also Read: Chiranjeevi’s Heroines: ఆ హీరోయిన్ తో వర్క్ చేయడం ఎంతో థ్రిల్ ని ఇచ్చింది: చిరంజీవి