Trivikram Srinivas : గురూజీకి 6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..?

Trivikram Srinivas మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు 6 కోట్ల విలువైన గిఫ్ట్ ఒకటి

Published By: HashtagU Telugu Desk
Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion

Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion

Trivikram Srinivas మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు 6 కోట్ల విలువైన గిఫ్ట్ ఒకటి ఇచ్చారట. ఆ గిఫ్ట్ ఏంటి..? ఇచ్చింది ఎవరు..? అన్న విషయాలు బయటకు రాలేదు కానీ. ఆయన డైరెక్షన్ లో సినిమాలు చేయడమే కాదు ఆ హీరో నటించిన సినిమాలకు వెనక సపోర్ట్ చేస్తున్నందుకు త్రివిక్రం కు అంత గొప్ప కానుక ఇచ్చాడట సదరు హీరో.

టాలీవుడ్ లో త్రివిక్రం ఇప్పటివరకు ముగ్గురు నలుగురు స్టార్స్ తోనే సినిమాలు చేశాడు. జల్సా నుంచి పవన్ తో ప్రయాణం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో కూడా హ్యాట్రిక్ సినిమాలు హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు త్రివిక్రం.

Also Read : Bigg Boss 7 : ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆల్రెడీ పెళ్లైందా.. మరి ఎందుకు దాచేస్తుంది..?

మహేష్ తో అతడు, ఖలేజా తర్వాత గుంటూరు కారం (Gunturu Karam) చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో త్రివిక్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఎన్.టి.ఆర్ తో కూడా అరవింద సమేత సినిమా చేశాడు త్రివిక్రం. తనతో పనిచేసిన వారందరికి తన ప్రతిభతో మెప్పించే త్రివిక్రం అతన్ని ముద్దుగా గురూజీ అని పిలుచుకునేలా చేశాడు.

పవన్ తో త్రివిక్రం సినిమా అనుబంధం మాత్రమే కాదు బయట కూడా ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే త్రివిక్రం బర్త్ డే కానుకగా ఆ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో పవన్ అనే అనుకోవచ్చు. అయితే ఇది నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రం మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంది.

పవన్ తో త్రివిక్రం సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది. ఏపీలో ఎలక్షన్స్ తర్వాత ఈ కాంబినేషన్ పై క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 12 Nov 2023, 09:36 AM IST