Mahesh -Rajamouli Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ – రాజమౌళి కలయికలో సినిమా చూడాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించబోతున్న. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి కొన్ని లీక్స్ ఇస్తుండగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.
ప్రముఖ సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా ‘SSMB29′ మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ కూడా రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారని… రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారతదేశపు అత్యంత ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుంది..’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ తన మేకోవర్ మొత్తాన్ని చేంజ్ చేసుకొని హాలీవుడ్ హంక్ లాగా మారిపోయాడు. మరి సినిమా ఏ విధంగా ఉంటుందో..ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలి.
Superstar #MaheshBabu‘s globe trotting adventure film #SSMB29 to be made on a whopping ₹1️⃣0️⃣0️⃣0️⃣ cr budget.
India’s most expensive film to be directed by SS Rajamouli and will… pic.twitter.com/amq5gw04XN
— Manobala Vijayabalan (@ManobalaV) October 28, 2024
Read Also : Sadhguru Tips : ఆరోగ్యకరమైన జీవితం కోసం సద్గురు ఇచ్చిన కొన్ని జీవిత చిట్కాలు..!