SSMB29 : ఎయిర్ పోర్ట్‌లో మహేష్, రాజమౌళి.. వీడియో వైరల్..

ఎయిర్ పోర్ట్‌లో కలిసి కనిపించిన మహేష్, రాజమౌళి. వైరల్ అవుతున్న వీడియో చూసిన అభిమానులు..

Published By: HashtagU Telugu Desk
Ssmb29 Director Rajamouli Hero Mahesh Babu Papped At Air Port

Ssmb29 Director Rajamouli Hero Mahesh Babu Papped At Air Port

SSMB29 : దర్శకధీరుడు రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ఆడియన్స్ నుంచి హాలీవుడ్ ఆడియన్స్ వరకు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకుంటుంది, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందనే ఆసక్తిలో ప్రేక్షకులు ఉన్నారు.

అయితే గుంటూరు కారం సినిమా పనులు అయిన దగ్గర నుంచి మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అటు రాజమౌళి కూడా ఫ్యామిలీతో విదేశీ టూర్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇవన్నీ చూసిన అభిమానులు.. అసలు మూవీ స్టార్ట్ చేయకుండా ఈ వెకేషన్స్ ఏంటి..? రాజమౌళి సినిమా అంటేనే ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మొదలు పెట్టడానికే లేట్ చేస్తే.. ఇంక ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అంటూ టెన్షన్ పడుతూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

ఇలా టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఓ వీడియో ఫుల్ జోష్ ని ఇస్తుంది. ఆ వీడియో మహేష్ బాబు, రాజమౌళి కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్నారు. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అక్కడి నుంచి దుబాయ్ వెళ్లారు. ఇక రాజమౌళి కూడా రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. వీరిద్దరూ కలిసి అక్కడ SSMB29 సినిమా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక దుబాయ్ లో కలుసుకున్న వీరిద్దరూ.. నేడు ఉదయం అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దర్ని కలిపి చూసిన అభిమానులు.. త్వరగా మూవీ లాంచ్ చేసేయండి అంటూ సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి జక్కన్న ఈ మూవీని ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి.

Also read : Mansoor Ali Khan : నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ను హత్య చేసేందుకు కుట్ర..?

  Last Updated: 19 Apr 2024, 10:07 AM IST