SSMB 28: తలకు రెడ్‌ టవల్‌, సిగరేట్‌ తాగుతూ ఊరమాస్ లుక్‌లో మహేశ్ బాబు.. ఆనందంలో ఫ్యాన్స్ ..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘SSMB 28’. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

Published By: HashtagU Telugu Desk
SSMB 28

Resizeimagesize (1280 X 720) 11zon

SSMB 28: సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘SSMB 28’. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బ్యాక్‌ సైడ్‌ నుంచి ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మహేశ్ మాస్ లుక్ ఫ్యాన్స్‌ని ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అయితే సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న మహేష్‌-త్రివిక్రమ్‌ ల సినిమా టైటిల్‌ ని వెల్లడించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Also Read: K Vasu : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కన్నుమూత..

తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. అదే రోజు మాస్‌ స్ట్రైక్‌ పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది యాక్షన్‌ సన్నివేశాలతో ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా మరో కొత్త పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. మహేష్‌ బ్యాక్‌ సైడ్‌ నుంచి ఉన్న కొత్త లుక్‌ ఇది. తలకు రెడ్‌ టవల్‌ కట్టుకుని, సిగరేట్‌ తాగుతూ, చెక్స్ షర్ట్ లో బ్యాక్‌ గ్రౌండ్‌లో మహేష్‌ లుక్‌ ఊరమాస్‌గా ఉంది. ఇక మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా, శ్రీలీల మరో హీరోయిన్‌గా చేస్తుంది. జాన్‌ అబ్రహం విలన్ రోల్‌ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళితో మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

  Last Updated: 27 May 2023, 12:16 PM IST