సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి (Mahesh Babu- Rajamouli) కలయికలో ఓ భారీ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గరి నుండి అభిమానుల్లో , సినీ లవర్స్ లలో అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. మామూలుగానే రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి..అలాంటిది సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడంటే..ఇక ఆ అంచనాలకు అడ్డు అనేది ఉండదు. ప్రతిదీ ఓ సంచలనమే..ప్రస్తుతం ఈ చిత్రానికి సంబదించిన టైటిల్స్ ఇవే అంటూ రెండు టైటిల్స్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ‘గరుడ’ (Garuda) ‘మహారాజ్’ (Maharaj) అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసినట్లు చెపుతున్నారు. అయితే రాజమౌళి ఇందులో ‘మహారాజ్’ అనే టైటిల్ పై ఆసక్తిని చూపిస్తున్నట్టు వినికిడి.
CBN : నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి – చంద్రబాబు
ఈ సినిమా స్టోరీకి సరిగ్గా సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీకి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్ చేసారు. త్వరలోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. కాగా ఈ సినిమా కథాంశం బ్రిటిష్ – దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ ఎడిసన్ స్మిత్ రచనల నుంచి ప్రేరణ పొందిందని టాక్ అలాగే స్టోరీ మొత్తం ఆఫ్రికా అడవులలో ఉంటుందని తెలుస్తుంది.