Site icon HashtagU Telugu

Made In India : ‘మేడ్ ఇన్ ఇండియా’.. రాజమౌళి నెక్స్ట్ మూవీ విశేషాలివీ

Made In India

Made In India

Made In India : దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ సినిమా ఏమిటి ?  ఎప్పుడొస్తుంది ? అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. మహేష్ బాబుతో మూవీ తీయడానికి ముందు.. మరొక సినిమాను ఆయన రిలీజ్ చేయబోతున్నారు. దానిపేరే ‘మేడ్ ఇన్ ఇండియా’ !! ఈ మూవీ స్టోరీ ఏమిటో తెలుసా ?  భారత సినిమా పరిశ్రమ చరిత్ర  !!  దీనిపైనే రాజమౌళి బయోపిక్ తీయబోతున్నారు. ఇండియా సినిమా ఎలా పుట్టింది ? ఎలా ఎదిగింది ? ఎవరు ఇండియన్ సినిమాని మొదలుపెట్టారు ? అనే కథాంశంతో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉండబోతోంది. రాజమౌళి పర్యవేక్షణలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు SS కార్తికేయ కలిసి ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీని నిర్మిస్తున్నారు. ఈవివరాలను రాజమౌళి ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

Also read : Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ సోదాలు!

‘‘బయోపిక్స్ తీయడం చాలా కష్టం. ఇక ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీయాలంటే మరింత కష్టం. ఈ సినిమాని నాకు నేరేషన్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. అందుకే చాలా గర్వంతో ఈ మేడ్ ఇన్ ఇండియా సినిమాను ప్రజెంట్ చేస్తున్నాను’’  అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ మూవీ (Made In India) పాన్‌ ఇండియా స్థాయిలో 6 భాషల్లో రూపొందనుంది. ఇంతకుముందు  యమదొంగ సినిమాను తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన రాజమౌళి… ఆ తర్వాత మళ్లీ ప్రొడక్షన్ వైపు వెళ్లలేదు. ఇటీవలే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాను పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.