Site icon HashtagU Telugu

Srinu Vaitla : ‘విశ్వం’ తో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్..?

Srinu Vaitla Is Back

Srinu Vaitla Is Back

శ్రీను వైట్ల (Srinu Vaitla) ఈ పేరు వినగానే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తుకొస్తాయి. నీకోసం , ఆనందం , సొంతం, వెంకీ , ఢీ, రెడీ , కింగ్ , దూకుడు, దుబాయ్ శ్రీను ఇవన్నీ కూడా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న సినిమాలే. ఇక దూకుడు సినేమైతే మహేష్ కెరియర్ లోనే ఓ మైలు రాయి చిత్రంగా నిలిచినా మూవీ. అలాంటి సూపర్ హిట్స్ అందించిన శ్రీను వైట్ల..ఇప్పుడు ఓ హిట్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. దూకుడు తర్వాత చేసిన బాద్షా, ఆగడు , బ్రూస్ లీ ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. దీంతో శ్రీను వైట్ల కు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. గతంలో శ్రీను వైట్ల తో హిట్స్ అందుకున్న వారు కూడా ముఖంచాటేయడంతో చివరకు గోపీచంద్ (Gopichand) ను పట్టుకొని విశ్వం (Vishwam) అనే మూవీ చేసాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ లో కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటిస్తుంది. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయేసరికి ఈ సినిమా వస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. దసరా పండుగ కానుకగా మొత్తం 7 సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. అయితే విశ్వం మూవీ సక్సెస్ సాధించడం దర్శకుడు శ్రీనువైట్లకు చాల అవసరం. కేవలం శ్రీను వైట్లకు మాత్రమే కాదు హీరో గోపి చంద్ కు అలాగే హీరోయిన్ కావ్య తో పాటు పీపుల్స్ మీడియా కు సైతం ఈ మూవీ సక్సెస్ చాల ముఖ్యం. మేకర్స్ మాత్రం విశ్వం సూపర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరని , ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని ఉన్నాయని, ఈ సినిమాతో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. చూద్దాం విశ్వం..ఏంచేస్తుందో !!

Read Also : Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి