Site icon HashtagU Telugu

Srileela Special Song : శ్రీలీల స్పెషల్ సాంగ్.. ఏ సినిమా కోసమో తెలుసా..?

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Special Song మొన్నటిదాకా వరుస సినిమాలతో హడావిడి చేసిన శ్రీ లీల ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మహేష్ తో చేసిన గుంటూరు కారం సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా శ్రీలీల కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ సినిమా హిట్ అయ్యింది అంటే అది కేవలం మహేష్ వన్ మ్యాన్ షో వల్లే. వరుస సినిమాలతో అదరగొట్టిన శ్రీలీలకు ఇప్పుడు సడెన్ బ్రేక్ పడింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో సినిమా లేదు.

తెలుగులో ఎలాగు లక్ కలిసి రావట్లేదని కోలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు. ఈ క్రమంలో అక్కడ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ దక్కించుకుందని టాక్. శ్రీలీల అప్పుడే స్పెషల్ సాంగ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ టఫ్ టైం లో ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే ఓకే చెప్పాలి. అందుకే అమ్మడు దళపతి విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కి సైన్ చేసిందట.

దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న ది గోట్ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. విజయ్ గోట్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. త్రిష కూడా క్యామియో రోల్ చేస్తుందని టాక్. ఇప్పుడు ఆ ఇద్దరే కాకుండా శ్రీలీల కూడా సర్ ప్రైజ్ చేయనుంది.

విజయ్ గోట్ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో కూడా విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారు. కస్టడీ తర్వాత వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : Mahesh Babu Abhibus : మహేష్ అభి బస్ కొత్త యాడ్ చూశారా.. డైరెక్టర్ ఎవరంటే..?