Site icon HashtagU Telugu

Srileela : అందరి దారిలోనే శ్రీలీల కూడా.. అక్కడ రెండు ప్రాజెక్టులు సైన్..?

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న ఈ టైం లో ఇక్కడ హీరోయిన్ కు కూడా బాలీవుడ్ చాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్స్ అంతా కూడా బాలీవుడ్ బాట పట్టగా లేటెస్ట్ గా శ్రీలీల కూడా హిందీ చలన చిత్ర పరిశ్రమ నుంచి క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. సౌత్ లో కాస్త క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోయిన్ బాలీవుడ్ బాట పడుతుండగా లేటెస్ట్ గా వారి దారిలోనే శ్రీలీల కూడా అక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహిం అలి హీరోగా చేస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా లాక్ అయ్యింది.

ఈ సినిమాతో పాటుగా వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న మరో సినిమాలో కూడా శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఎంట్రీ ఇవ్వడమే రెండు క్రేజీ సినిమాల ఛాన్స్ అందుకుంది శ్రీలీల. సైఫ్ నట వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఇబ్రహిం తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఆల్రెడీ సైఫ్ కూతురు సారా అలి ఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ తో తెలుగు ఆడియన్స్ లో నిరుత్సాహం మొదలైంది. అమ్మడు కొన్నాళ్లు తెలుగులో సినిమాలు చేస్తుందని భావించగా ఇప్పుడే బాలీవుడ్ వెళ్లడంపై అందరు షాక్ అవుతున్నారు. ఐతే బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా సౌత్ సినిమా అంటే చాలు తానెప్పుడైనా రెడీ అంటుంది శ్రీలీల. తెలుగులో లాస్ట్ ఇయర్ ఏడు సినిమాల దాకా చేసి రెండు హిట్లు మాత్రమే అందుకున్న శ్రీలీల మళ్లీ ఇక్కడ కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.

Also Read : Samantha : బాలీవుడ్ బాద్షాతో సమంత.. ఆ సూపర్ కాంబో రిపీట్..!