Waltair Veerayya Second Single: మంచుకొండల్లో చిరు-శృతి రొమాన్స్, వీరయ్య రెండో సాంగ్ ఇదిగో!

చిరంజీవి (Chiranjeevi), శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ జోరు పెంచుతోంది.

Published By: HashtagU Telugu Desk
Waltair Veerayya second single

Waltair Veerrayaa

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది.

ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ (Sridevi Chiranjeevi) ని రిలీజ్ చేశారు మేకర్స్. చిరంజీవి, శృతి హాసన్‌ జంట బాగా ఆకట్టుకుంది. శ్రుతి హాసన్‌, చిరంజీవికి జోడిగా చూడటం ఇదే మొదటిసారి. శ్రుతి హాసన్ అందంగా ఉంది. బాస్, శృతి హాసన్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మరో మ్యూజికల్ ట్రీట్ ని స్కోర్ చేశారు. ఈ పాటలో చిరంజీవి, శ్రీదేవిల ఐకానిక్ పెయిర్ ప్రస్తావన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌లో మంచుతో కప్పబడిన లొకేషన్ కన్నుల పండువగా కనిపిస్తోంది. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి, శృతి హాసన్‌లపై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Also Read: Keerthy Suresh: కీర్తి సెక్స్ అప్పీల్ లుక్స్.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్పైసీ ఫోజులు!

  Last Updated: 19 Dec 2022, 05:15 PM IST