Om Bheem Bush Two Days Collections : ఓం భీం బుష్ రెండు రోజుల వసూళ్ల లెక్క ఇదే..!

Om Bheem Bush Two Days Collections శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం

  • Written By:
  • Updated On - March 24, 2024 / 01:04 PM IST

Om Bheem Bush Two Days Collections శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పాయింట్ కొత్తదే అయినా దాన్ని ఆద్యంతం వినోదంగా తెరకెక్కినడం వల్ల సినిమా ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. సినిమా ప్రచార చిత్రాలు కూడా బాగుండటం వల్ల సినిమా ఫస్ట్ డే 4.6 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది.

సినిమా ఫస్ట్ డే కన్నా రెండో రోజు వసూళ్లను అదరగొట్టింది. ఓం భీం బుష్ రెండో రోజు 5.84 కోట్ల గ్రాస్ తో సూపర్ అనిపించుకుంది. సో రెండు రోజుల్లోనే 10.44 కోట్ల గ్రాస్ తో ఓం భీం బుష్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా 260కె కలెక్ట్ చేసింది.

లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు. ఈసారి ఓం భీం బుష్ అంటూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా విషయంలో శ్రీ విష్ణు మొదటి నుంచి సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. టీజర్ తోనే బజ్ పెంచగా సినిమా ట్రైలర్ ఆసక్తి కలిగేలా చేసింది. ఇక శుక్రవారం రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లతో అదరగొడుతుంది.

Also Read : Shruthi Hassan : డైరెక్టర్ తో రొమాన్స్ కోసం హీరోయిన్ బలవంతం..!