Sri Simha : కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించాడు. ఇటీవల మత్తు వదలరా 2 సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. ఇటీవల డిసెంబర్ 14న ఈ హీరో మురళి మోహన్ మనవరాలు రాగని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు అధికారికంగా ఎక్కడా పోస్ట్ చేయకపోయినా కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి.
అయితే ఇన్ని రోజులు వీరిద్దరిది అరేంజ్డ్ మ్యారేజి అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా హీరో తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వీరిది ఆరేళ్ళ ప్రేమ అని తెలిపాడు. తన భార్య రాగతో కలిసి దిగిన ఫొటోలని, ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫోటోలను షేర్ చేసి.. ఇప్పటికి ఆరేళ్ళు ఇక నుంచి ఎప్పటికి రాసిపెట్టి ఉంది అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ హీరోది ప్రేమ వివాహమా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది..