Shekar Master: అందరూ చూస్తుండగానే శేఖర్ మాస్టర్ కి ముద్దు పెట్టిన శ్రీముఖి.. క్లారిటీ ఇచ్చిన డాన్స్‌ మాస్టర్‌?

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 01:30 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ కమ్ డాన్సర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. అలాగే ఇప్పుడు స్టార్‌ హీరోలకు ఆయనే ఫస్ట్ ఛాయిస్‌. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడలోనూ కొరియోగ్రఫీ చేస్తున్నారు. బాలీవుడ్‌ లోనూ ఆఫర్లని అందుకుంటున్నారు మనం శేఖర్ మాస్టర్.

ఫుల్‌ బిజీగా ఉంటూ డాన్స్ షోలోనూ మెప్పిస్తున్నారు. ఢీ షోకి కూడా తను జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌ ప్రణతితో కలిసి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే శేఖర్‌ మాస్టర్‌ కేవలం జడ్జ్ గానే కాదు, అడపాదడపా స్కిట్లు కూడా వేస్తుంటారు. కొన్నాళ్లపాటు జబర్దస్త్ లో స్కిట్లు వేశారు. ఆ తర్వాత కామెడీ స్టార్స్ అనే షోలోనూ స్కిట్లు ప్రదర్శించారు. పైగా దానికి జడ్జ్ గా కూడా ఉన్నారు. హైపర్‌ ఆదితో కలిసి చేసిన స్కిట్లు మంచి ఆదరణ పొందాయి. నవ్వులు పూయించాయి.

ఈ క్రమంలో శేఖర్‌ మాస్టర్‌ పై ఒక రూమర్‌ క్రియేట్‌ అయ్యిందట. అమ్మాయిల ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంటుందనే ప్రచారం స్టార్ట్ చేశారట. అయితే ఈ క్రమంలో ఓంకార్‌ నిర్వహించే సిక్త్స్ సెన్స్ షోలో శేఖర్‌ మాస్టర్‌, శ్రీముఖి పాల్గొన్నారు. ఇందులో స్టేజ్‌పైనే ఓంకార్‌ ముందు రెచ్చిపోయింది శ్రీముఖి. ఉమ్మా ఉమ్మా.. అంటూ శేఖర్‌ మాస్టర్‌కి ముద్దు పెట్టింది. అప్పట్లో అది పెద్ద సెన్సేషనల్‌ అయ్యింది. ఆ తర్వాత శేఖర్‌ మాస్టర్‌ వైఫ్‌ శిరీషకి కూడా వివరణ ఇచ్చారు. కేవలం స్కిట్లో భాగంగా చేశామని, నిజమైన ముద్దు కాదని తెలిపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

అది బాగా వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాని ఊపేసింది. తాజాగా దీనిపై శేఖర్‌ మాస్టర్‌ వివరణ ఇచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ ముద్దు సీన్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అమ్మాయిల ఫాలోయింగ్‌కి, శ్రీముఖి ముద్దులకు ముడిపెడుతూ ట్రోల్‌ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో శేఖర్‌ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు. ఇక ముద్దు సీన్‌ గురించి చెబుతూ, ఓంకార్‌ షోలో తన సెన్స్ ని టెస్ట్ చేసే క్రమంలో శ్రీముఖి ఊరికే అలా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దు పెట్టినట్టు చేసిందని అది ఆమె జస్ట్ సరదాగా చేసిందని తెలిపారు. ఆమె చేసిందానికి నేనేం చేస్తా, దానికి ఏదేదో అల్లుకుంటున్నారు. కానీ అది జస్ట్ ఫన్‌ కోసం చేసిందే అని తెలిపారు శేఖర్‌ మాస్టర్‌.