Sreeleela : ధమాకా బ్యూటీ శ్రీలీల వెంటాడుతున్న అరుదైన వ్యాధి

ఈమెను ఓ అరుదైనా వ్యాధి ఇబ్బంది పెడుతుంది. శ్రీలీల ఒక్కసారి తుమ్మితే కంటిన్యూగా 20 నిమిషాల వరకు అలా తుమ్ముతూనే ఉంటుందట

Published By: HashtagU Telugu Desk
Sreela

Sreela

సినిమా స్టార్స్ అనగానే వారి డబ్బు..హోదా..పాపులార్టీ ఇవే గుర్తుకొస్తాయి. కానీ వీటి వెనుక వారి కష్టం..ఆరోగ్యం ఇవేవి కూడా చాలామంది పట్టించుకోరు. ఎంతసేపు తెరపై వారిని మాత్రమే చూస్తుంటారు. కానీ వారి లైఫ్ లో కూడా బాధలు , సమస్యలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా వారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. టైంకు నిద్ర లేక..నిత్యం షూటింగ్ లతో బిజీ గా ఉంటూ..క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అందుకే వారు అనారోగ్యం బారినపడుతుంటారు. తాజాగా ధమాకా ఫేమ్ శ్రీలీల (Sreeleela ) సైతం ఆప్ అరుదైన వ్యాధి తో బాధపడుతుందట.

పెళ్లి సందD మూవీ తో తెలుగు నాట అడుగుపెట్టిన ఈ భామ..మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో , డాన్స్ లతో కట్టిపడేసింది. ఆ తర్వాత ధమాకా (Dhamaka) సినిమా ఆమెను ఏకంగా స్టార్ హీరోయిన్ ను చేసేసింది. ధమాకా లో ఆమె డాన్స్ లు యూత్ కు కిక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు అమ్మడి చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. అవి కూడా మామలు హీరోలతో కాదు పవర్ స్టార్ , సూపర్ స్టార్ వంటి అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతో జోడి కడుతుంది. ఇవన్నీ విడుదలైతే అమ్మడి ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. అమ్మడి డిమాండ్ , పాపులర్ చూసి ప్రతి ఒక్కరు శ్రీలీల నే కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈమెను ఓ అరుదైనా వ్యాధి (Sreeleela Suffering From A Rare Disease) ఇబ్బంది పెడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

శ్రీలీల ఒక్కసారి తుమ్మితే కంటిన్యూగా 20 నిమిషాల వరకు అలా తుమ్ముతూనే ఉంటుందట. ఆలా కంటిన్యూగా తుమ్మేసరికి చాలాసార్లు శ్రీలీల ఇబ్బంది పడి డాక్టర్లను కలిసినా కూడా ఫలితం లేకుండా పోయిందట. ఈ వ్యాధి కారణంగానే చాలా సార్లు కొన్ని సినిమా షూటింగ్ లకు డుమ్మా కొట్టినట్లు స్వయంగా అమ్మడే చెప్పింది. ఈ విషయం తెలిసి అయ్యో..అనుకుంటూ త్వరగా తగ్గాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ లో బాలకృష్ణ చెల్లెలుగా నటించింది. కాజల్ హీరోయిన్ గా నటించగా అనిల్ రావిపూడి డైరెక్టర్. దసరా కానుకగా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : CM KCR Election Campaign : ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్న కేసీఆర్..17 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్

  Last Updated: 11 Oct 2023, 11:08 AM IST