Sreeleela : టాలీవుడ్‌కు శ్రీలీల ఎంట్రీ ఓ సంచలనం లా మారింది. తొలి సినిమా పెళ్లి సందడితో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, యువతలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది. డ్యాన్స్, గ్లామర్‌తో తెరపైన మెరిసిపోయిన ఈ నటి, కొద్ది కాలంలోనే అవకాశాల వర్షం పొందింది. ఒకే ఏడాదిలో తొమ్మిది సినిమాల్లో నటించడం సాధారణ విషయం కాదు. కానీ, ఆ బిజీ షెడ్యూళ్ల వెనక ఫలితం ఆశించినంతగా రాలేదు.
ఇప్పటివరకు చేసిన సినిమాల్లో, శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పెద్దగా లేవు. ఎక్కువగా హీరోల పక్కన గ్లామర్ పార్ట్స్‌లో కనిపించినా, ఆ చిత్రాల్లో చాలావరకు వాణిజ్యంగా ఫెయిల్ కావడం వల్ల, ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిస్పాన్స్ అంత ఆశాజనకంగా లేదు. ఇదే సమయంలో, ఆమె నటనలో లోతులేదు అన్న టాక్ కూడా మొదలైంది.
అయితే ఇటీవల పుష్ప-2లో చేసిన ఐటెం సాంగ్ ఆమెకు తిరిగి బాగా క్రేజ్ తీసుకొచ్చింది. మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో, మళ్లీ అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇది ఆమెకు మరోసారి కెరీర్ తిరిగిరావడానికి బలమైన చాన్స్ కావచ్చు. అయితే, ఇక్కడే ఆమె తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు తాలూకు కెరీర్‌ని నిర్ధారిస్తాయి.
Central Government Scheme : కేంద్రం మహిళలకు అందిస్తున్న రూ. 5 లక్షల రుణం కోసం ఎలా అప్లై చేయాలంటే !!
శ్రీలీల ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టులపై ఒకసారి వెనక్కి చూసుకుంటే, నటనకు చోటు ఉండే పాత్రలు కనిపించడం లేదు. తాజాగా కిరీటి సినిమాలో నటిస్తున్నా, అది కూడా కేవలం గ్లామర్ టచ్ ఉన్న పాత్రగానే చెబుతున్నారు. బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో చేస్తున్న చిత్రంలోనూ ఆమెకు నటనకు స్కోప్ ఉందన్న వార్తలు వినిపించడంలేదు.
ఈ నేపథ్యంలో, శ్రీలీలకు ఒక స్పష్టమైన ఆలోచన అవసరం.. డ్యాన్స్, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, న్యాయంగా నటనకు ఛాలెంజ్ ఉండే రోల్స్ ఎంచుకోవాలి. అది ఆమెకి ఒక బలమైన ఫ్యాన్ బేస్‌ను నిర్మించేందుకు దోహదపడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో లాంగ్ రన్ అందుకునే హీరోయిన్‌లను చూసినా.. సాయిపల్లవి, రష్మిక, కీర్తి సురేష్, అనుష్క శెట్టి.. ఇవాళ కూడా వారు సర్వైవ్ అవుతున్న కారణం, వాళ్లు చేసిన బలమైన పాత్రలే.
శ్రీలీల కూడా అదే దిశగా ఆలోచించి, తన కెరీర్‌ను కొత్త దశలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. పాన్ ఇండియా రేంజ్‌లో కూడా ఆమెకు మంచి స్థానం లభించవచ్చు. లేకపోతే, గ్లామర్ ఆధారిత పాత్రలు త్వరగా రిస్క్ అయ్యే అవకాశమే ఎక్కువ. కాబట్టి, టైం ఇంకా ఉంది.. తగిన నిర్ణయాలు తీసుకుంటే, శ్రీలీలకే చెందిన ఒక ప్రత్యేక స్థానం టాలీవుడ్‌లో ఖచ్చితంగా ఏర్పడుతుంది.
Amazon prime day offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్