Site icon HashtagU Telugu

Sreeleela beats Rashmika: రష్మికకు శ్రీలీల ఝలక్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ!

Sreeleela

Sreeleela

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే మొదటగా అందరికి గుర్తుకు వచ్చేది యంగ్ బ్యూటీ శ్రీలీలనే. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్ కమింగ్ లేడీ సూపర్ స్టార్. ఈ బ్యూటీ  ఇప్పటికే ముఖ్యమైన పాత్రలను దక్కించుకుంటూ తనకంటూ పేరు సంపాదించుకుంది.  ప్రస్తుతం అర డజనుకు పైగా తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది శ్రీలీల. వాస్తవానికి ఇతర నటీమణుల కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్‌లను కూడా ఆమె టేకోవర్ చేసింది.

శ్రీలీల ధాటికి పూజహేగ్డే, రష్మిక సైతం సినిమా ఆఫర్లను వదులుకోవాల్సి వస్తుందంటే ఈ బ్యూటీ క్రేజ్ ఏపాటిదో అర్దం చేసుకోవచ్చు. నితిన్ నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్నను తీసుకున్నారు. ఇది రష్మికకు ఝలక్ గానే చెప్పాలి. దర్శకుడు వెంకీ కుడుముల నితిన్, రష్మిక మందన్నలతో సినిమా తీయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. వారు తమ పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి సినిమాను ప్రమోట్ చేయడానికి #VNRTrio అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు “R” స్థానంలో “S” అక్షరం వచ్చింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల రష్మిక స్థానంలో శ్రీలీలాను తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉంది. రష్మిక మందన్న ప్రస్తుతం మరిన్ని హిందీ చిత్రాలకు సైన్ చేస్తూ తన బాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెడుతోంది. మరోవైపు తెలుగు యువతలో రష్మిక కంటే శ్రీలీలకే ఎక్కువ ఆదరణ ఉంది. అందుకే హీరోయిన్ ను మార్చాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. రష్మిక, నితిన్ గతంలో వెంకీ కుడుముల తీసిన విజయవంతమైన చిత్రం “భీష్మ”లో కలిసి పనిచేశారు.

Also Read: Kalvakuntla Kavitha: రాహుల్ గాంధీకి కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న