Sreeja Konidela : వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన చిరంజీవి కూతురు

ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను శ్రీజ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది

Published By: HashtagU Telugu Desk
Srija New Busness

Srija New Busness

చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఎంతో పేరు ఉన్నప్పటికీ..తన చిన్న కూతురు శ్రీజ (Sreeja Konidela) విషయంలో మాత్రం ఆయనపై కొన్ని విమర్శలు వెంటాడుతూ ఉంటాయి. పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీజ..పిల్లలు పుట్టిన తర్వాత భర్త తో విడాకులు తీసుకొని తిరిగి తండ్రి వద్దకు చేరుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి కళ్యాణ్ ను రెండో వివాహం చేసుకుంది. మెగా ఫ్యామిలీ లో అడుగుపెట్టిన కళ్యాణ్..ఆ తర్వాత చిత్రసీమలోకి కూడా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేసాడు. తర్వాత ఏమైందో కానీ కళ్యాణ్ – శ్రీజ లు ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ..దీనిపై క్లారిటీ మాత్రం లేదు. శ్రీజ గత కొంతకాలంగా తండ్రి వద్దే ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఇప్పుడు శ్రీజ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను శ్రీజ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ వ్యాపారం ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, శిల్పాశెట్టి వంటి సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే ఇందులో శరీరానికి ప్రశాంతత కలిగించడానికి జిమ్, యోగా చేయడానికి అత్యాధునిక సాధనాలు ఉన్నట్టు సమాచారం. ఇక చిరంజీవి ఫ్యామిలీ ఉన్న వారంతా ఏదొక బిజినెస్ చేస్తూ తమకంటూ ఓ టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత క్యాస్టూమ్ డిజెనర్ గా రాణిస్తుండగా..చరణ్ ఓ పక్క హీరోగా రాణిస్తూనే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఉపాసన కూడా అంతే..ఇక చిరంజీవి సతీమణి సురేఖ సైతం రీసెంట్ గా పికిల్ వ్యాపారం మొదలుపెట్టింది. ఇలా ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని వ్యాపారాలు చేస్తున్నారు.

Read Also : Arvind Kejriwal : కేజ్రీవాల్‌‌ విడుదలకు లా స్టూడెంట్ ‘పిల్’.. హైకోర్టు రూ.75వేల జరిమానా

  Last Updated: 22 Apr 2024, 12:46 PM IST