Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట్ల ప్రజలకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని వీరంతా అభిప్రాయపడ్డారు. Some things […]

Published By: HashtagU Telugu Desk
Celebrities Congratulations To Vijay On TVK

Celebrities Congratulations To Vijay On TVK

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట్ల ప్రజలకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని వీరంతా అభిప్రాయపడ్డారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు చెందిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎవరూ ఊహించని విధంగా డామినేషన్ చూపించింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి, తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన విజయం సాధించిన విజయ్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ వంటి టాలీవుడ్ స్టార్స్ కంగ్రాట్స్ చెప్పారు.

డియర్ విజయ్, మొదటి ఎన్నికలోనే మీరు ఇలాంటి అద్భుతమైన విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మీరు దీనికి అర్హులు. మీరు అచంచలమైన ప్యాషన్ తో, లక్ష్యంతో స్ఫూర్తినిస్తూ, నాయకత్వం వహిస్తూ, సేవ చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మీరు అందించే ప్రజా సేవకు నా శుభాకాంక్షలు అని చిరంజీవి పోస్ట్ చేశారు.

న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి, స్టన్నింగ్ విక్టరీ సాధించినందుకు విజయ్ కి హృదయపూర్వక అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయమే నిదర్శనం… ఈ విజయం తమిళనాడుకు అర్థవంతమైన పురోగతిని అందిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని మహేష్ బాబు ఎక్స్ లో పేర్కొన్నారు.

ప్రజల ప్రేమ, మద్దతు పొందడం ఒక వరం. నా స్నేహితుడు విజయ్‌పై తమిళనాడుకు గొప్ప నమ్మకం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అని సూర్య ట్వీట్ చేశారు.

తమిళనాడు ఎన్నికలలో ఘన విజయం సాధించిన విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ దార్శనికత, ప్రజలతో మీకున్న అనుబంధం ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమిళనాడును నిరంతర ప్రగతి పథంలో నడిపించడంలో మీరు గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము అని రామ్ చరణ్ గారు పోస్ట్ చేశారు.

కొన్ని విషయాలు జరుగుతాయని మనకు ముందే తెలుస్తుంది. ఇది కూడా అలాంటిదేనని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఈ ఘన విజయం సాధించినందుకు విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీరు ఈ శక్తివంతమైన కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో, గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. టీవీకే పార్టీని ఇలాగే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నారని రవితేజ పోస్ట్ పెట్టారు.

  Last Updated: 05 May 2026, 11:53 AM IST