Sonali Sood : ప్రముఖ నటుడు సోనూ సూద్ భార్య సోనాలీ సూద్ ప్రయాణిస్తున్న కారు.. ఓ ట్రక్కును వెనుక భాగంలో ఢీకొట్టింది. సోమవారం రాత్రి 10.30 గంటలకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం వార్ధా రోడ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముంబై – నాగ్‌పూర్ హైవేపై ఈ ఫ్లై ఓవర్ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనాలీ సూద్, ఆమె సోదరి సునిత, మేనల్లుడు ఉన్నారు. సునితకు స్వల్ప గాయాలే అయినప్పటికీ, సోనాలీ(Sonali Sood), ఆమె మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని నాగ్‌పూర్ నగరంలో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
Also Read :Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ పేరిట ఎన్నో రికార్డులు.. ఇవిగో
నాగ్‌పూర్‌కు చేరుకున్న సోనూ
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సోనూ సూద్ హుటాహుటిన నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ, తన వాళ్ల వైద్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటివరకు సోనూ సూద్ కుటుంబం ఎలాంటి ప్రకటన వెలువడలేదు.సోనాలీ సూద్, ఆమె మేనల్లుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కుటుంబీకులు ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read :New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?
సోనాలీ సూద్ గురించి..
- సోనాలీ సూద్ నాగ్‌పూర్‌లో జన్మించారు.
- ఆమె నాగ్‌పూర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు.
- సోనాలీ ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్.
- సోనాలీ సూద్, సోనూ సూద్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు.. ఇషాంత్ సూద్, అయాన్ సూద్.
- నాగ్‌పూర్‌లో సోనూ సూద్ ఇంజినీరింగ్ చేస్తుండగా, సోనాలీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ చేశారు.
- 1996 సెప్టెంబరు 25న సోనూ, సోనాలీ పెళ్లి చేసుకున్నారు.
- 1999 నుంచి సోనూ సూద్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. పెళ్లి తర్వాతే సోనూకు సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలైంది.