Sonu Vs Salman : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మద్యం అలవాటు లేదని.. అయితే ఏదో ఒక విధంగా తనతో మద్యం తాగించేందుకు చాలాసార్లు సల్మాన్ ఖాన్ యత్నించారని సోనూ సూద్ వెల్లడించారు. సల్మాన్‌తో కలిసి వివిధ సినిమాల్లో షూటింగ్‌లలో పాల్గొన్న క్రమంలో ఈ చేదు అనుభవం తనకు ఎదురైందన్నారు. ‘‘సల్మాన్ ఒక్కడే కాదు.. చాలామంది మూవీ స్టార్‌లు మద్యం తాగమని నన్ను బలవంత పెట్టారు. అయినా నేటి వరకు నేను చుక్క మద్యం కూడా తాగలేదు. ప్రత్యేకించి సల్లూ భాయ్ నాతో మద్యం తాగించేందుకు యత్నించేవారు. కనీసం రెడ్ బుల్‌లో మద్యం కలుపుకొని తాగవయ్యా అంటూ నాకు ఆయన ఉచిత సలహాలు ఇచ్చేవారు’’ అని సోనూ సూద్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ‘ఫతే’ సినిమాకు డైరెక్టరుగా సోనూ(Sonu Vs Salman) వ్యవహరించారు. ఈసందర్భంగా పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సినిమా గురించి కూడా ఇంటర్వ్యూలో వివరించారు.
Also Read :Worlds Oldest Person : ప్రపంచంలోనే వృద్ధ మహిళ ఇక లేరు.. 116 ఏళ్ల బామ్మ తుదిశ్వాస
‘‘ఎవరికైనా తాగుడు అలవాటు ఉంటే.. వాళ్లు ఇతరులతోనూ తాగించే ప్రయత్నం చేస్తారు. సల్మాన్ ఖాన్ అలాగే నా వెంట పడ్డారు. అయినా నేను ఎన్నడూ తాగలేదు’’ అని సోనూ సూద్ తెలిపారు. ‘‘నేను శాకాహారిని. నా డైట్ చాలా బోరింగ్‌గా ఉంటుంది. అయినా ఇష్టంగానే తింటాను. ఇటీవల కాలంలో నేను చపాతీలు తినడం మానేశాను. వాటికి బదులుగా చిన్న గిన్నెలో బియ్యం, పప్పు తింటున్నాను. టిఫిన్‌లో ఎగ్ ఆమ్లెట్, సలాడ్, అవకాడో, పపాయా, కూరగాయల ఫ్రై వంటివి తింటాను’’ అని సోనూ వివరించారు.
Also Read :Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం.. వాళ్లు మాత్రమే కొనాలి
‘‘నాకు కూడా బాడీగార్డ్స్ ఉన్నారు. అయితే పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టొద్దని వారికి సూచిస్తుంటాను. వారిపై అస్సలు చెయ్యి చేసుకోవద్దని సూచిస్తాను’’ అని సోనూ తెలిపారు. ‘‘కొంతమంది యాక్టర్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునేందుకు బాడీ గార్డులను పెట్టుకుంటారు’’ అని ఆయన చెప్పారు. సెలబ్రిటీ ఎవరైనా సరే ఎలాంటి హడావుడి లేకుండా బయట ప్రయాణాలు చేస్తే ఎవరూ పట్టించుకోరని తెలిపారు.