సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని పుకార్లు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సినీ నటీనటులకు (Movie Actors) సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ చేస్తుంటారు. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే అనుకుంటారు. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని తిరిగి సదరు నటి నటులు క్లారిటీ ఇచ్చే వరకు అవి అలాగే వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha Pregnant) కూడా అలాగే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. రెండు రోజులుగా తాను తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించారు.
తాను ప్రెగ్నెంట్ అని జరుపుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని తెలిపింది. సోషల్ మీడియాలో తనపై చేస్తున్న వ్యాఖ్యలపై సోనాక్షి మండిపడుతూ.. ఈ రకమైన రూమర్స్‌పై ఇకపైనా చర్చించకూడదని కోరారు. తాను గర్భం దాల్చలేదని స్పష్టం చేసిన సోనాక్షి.. తాను కొంచెం బరువు పెరిగానని, అందుకే లావుగా కనిపిస్తున్నానని .. ఆ కారణంగా తప్పుడు వార్తలు పుట్టించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి రూమర్లు తనను మరియు తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పెళ్లయి కేవలం నాలుగు నెలలే అయిందని, తాము ఇప్పటికీ జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నప్పుడు ఇలాంటి పుకార్లు వైరల్ కావడం బాధకరమని ఆమె అన్నారు. ఇక జూన్ 2024లో తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌తో వివాహం అయ్యింది.
Read Also : Saraswati Lands : ‘సరస్వతి’ భూముల విషయాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం