Shyam Singha Roy : శ్యామ్ సింగరాయ్ ఏదో తేడా కొడుతోందే..?

విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్ గా ఉంటుందనే సామెత సినిమా పరిశ్రమలో తరచూ వింటుంటాం. ఎక్కువసార్లు నిజం కూడా. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ విషయంలోనూ అదే జరగబోతోందా అనే అనుమానాలు పరిశ్రమలోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - December 20, 2021 / 05:28 PM IST

విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్ గా ఉంటుందనే సామెత సినిమా పరిశ్రమలో తరచూ వింటుంటాం. ఎక్కువసార్లు నిజం కూడా. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ విషయంలోనూ అదే జరగబోతోందా అనే అనుమానాలు పరిశ్రమలోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ కనిపిస్తోంది. లేదంటే ఈ సింగరాయ్ కి ప్యాన్ ఇండియన్ ఇమేజ్ లేదు అనేది వాస్తవం. అయినా ఆ రేంజ్ లోవిడుదల చేస్తున్నాం అంటూ లేచింది మొదలు నిద్రపోయేంత వరకూ ప్రమోషన్ పేరుతో హోరెత్తించడం చూస్తోంటే సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అనిపించక మానడం లేదు అంటున్నారు చాలామంది. ముఖ్యంగా ఈ డౌటనుమానం పరిశ్రమ నుంచే ఎక్కువగా వస్తుండటం ఆశ్చర్యం. అలాగని సినిమా పోవాలని ఎవరూ కోరుకోవడం లేదు. బట్.. ఏదో తేడాగా ఉందే అనే భావన మాత్రం వినిపిస్తోంది.

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. నాని రెండు భిన్నమైన పాత్రలు చేశాడు. ఒకటి 1970ల నేపథ్యంలో కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగే శ్యామ్ సింగరాయ్ పాత్ర. మరోటి ఈ కాలంలో సాగే పాత్ర. ఈ రెంటి మధ్య కనెక్షన్ విషయంలోనే చాలామంది డౌట్ పడుతున్నారు. ట్రైలర్ లో చూసినప్పుడు తలకు బలంగా దెబ్బ తగలడం.. తలలో కొన్ని నర్వ్స్ సైంటిఫిక్ రియాక్షన్ కు గురై.. రకరకాల ఆలోచనలతో ఏకంగా కథ వెనక్కి వెళ్లిపోవడం అనే పాయింట్ కనిపిస్తోంది. ఈ పాయింట్ చాల సినిమాల్లో చూశాం. ఎక్కువగా కామెడీకి వాడుకున్న పాయింట్ కూడా ఇదే. అయినా నాని ఏ ధైర్యంతో సినిమా ఒప్పుకున్నాడో కానీ.. ఆ ధైర్యం నిజమైతే వీళ్లు చెబుతున్నట్టు క్రిస్మస్ వీరిదే. లేదంటే.. ఈ పండగ వీరికి చేదుగా మారుతుందంటున్నారు.

ఇక నానితో పాటు నటించిన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లను కూడా ప్రమోషన్స్ లో బాగా కష్టపెడుతున్నారు. మొదట వరంగల్ వెళ్లారు. తర్వాత బెంగళూరు తో పాటు రకరకాల ప్రాంతాలు తిరుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ‘మార్నింగ్ వాక్’నుంచే మొదలుపెట్టి మరీ ప్రమోషన్స్ తో వాయిస్తున్నారు. ఒకవేళ ఇది మంచి సినిమా కాబట్టి.. ఇంకా ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చేయడానికే ఈ ప్రమోషన్ అయితే ఫర్వాలేదు. లేదూ.. విషయం వీక్ గా ఉంది కాబట్టే ఓపెనింగ్స్ తో గట్టెక్కాలనే ప్రయత్నం అయితే మాత్రం సింగరాయ్ బిస్కెట్ అవుతాడు అనే కమెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఏమౌతుందో చూడాలి.