Site icon HashtagU Telugu

Rajinikanth : రజినీకాంత్‌కి రైల్వే కూలీల సాయం.. ఆ కథేంటో తెలుసా..?

Some Railway Workers Help to Rajinikanth in his Studies Time

Some Railway Workers Help to Rajinikanth in his Studies Time

సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth)  గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో ఇండియాలోనే కాదు జపాన్, మలేషియా వంటి దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా తనకి ఇంతటి స్టార్‌డమ్ అందించిన ప్రేక్షకులకు రజినీకాంత్.. కృతజ్ఞతగా తన వంతు సహాయం అందిస్తుంటాడు. ఈక్రమంలోనే తన సంపాదనలో కొంత పేద ప్రజల కోసం ఖర్చు చేస్తుంటాడు. అయితే ఒకానొక సమయంలో రైలు టికెట్‌ పోగొట్టుకున్న రజినీకాంత్‌కి రైల్వే కూలీల సాయం చేశారట.

రజినీకాంత్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతున్న సమయంలో పరీక్షల ఫీజు కోసం ఇంట్లోవాళ్లు రూ.150 ఇచ్చారట. అయితే రజిని సరిగా చదవకపోవడంతో.. తప్పకుండా ఆ పరీక్షలు ఫెయిల్ అవుతాడని భావించాడు. దీంతో ఆ పరీక్ష ఫీజు పట్టుకొని మద్రాస్‌ రైలెక్కాడు. అయితే దారిలో టికెట్‌ ఎక్కడో పోగొట్టుకున్నాడట. ఆ తరువాత రైలులో టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రజినిని పట్టుకున్నాడట. రజినీకాంత్ అతనికి టికెట్‌ పోగుట్టుకున్న విషయం చెప్పాడు. కానీ ఆయన నమ్మలేదు. జరిమానా కట్టాల్సిందే అంటూ ప్రయాణకుల అందరి ముందు రజినిపై గట్టిగా అరిచాడట.

అక్కడే ఉన్న ఐదుగురు కూలీలు ఇది గమనించి.. రజినీకాంత్ కి డబ్బు సహాయం చేయడానికి ముందుకు వచ్చారట. అయితే రజిని ఆ డబ్బు తీసుకునే ముందు వారితో ఇలా అన్నాడట.. “నేను నిజంగా టికెట్ తీసుకోవడం లేదు అనుకుంటున్నారేమో. నేను టికెట్ కొన్నాను. నిజంగా అది ఎక్కడో పోయింది. ఆ మాట టీసీకి చెబుతుంటే నమ్మడం లేదు” అని చెప్పాడట. ఇక రజిని మాటల్లో నిజాయతీ చూసిన టీసీ.. ఎట్టకేలకు నమ్మాడు. ఒక తెలియని వ్యక్తి తనని నమ్మడం అదే తొలిసారని రజిని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మద్రాస్‌కి వచ్చాక కె.బాలచందర్‌ తనని నమ్మి ఇప్పుడు సూపర్ స్టార్ అవ్వడానికి దోహదపడ్డాడని పేర్కొన్నారు.

 

Also Read : Manikanta : అనాథలను చదివిస్తా.. పేద పిల్లలకు వైద్యం చేయిస్తా.. ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ మణికంఠ..