Site icon HashtagU Telugu

Sohail : యాంకర్ సుమ కాళ్ల మీద పడబోయిన హీరో.. ఆమె చేసిన సాయం అలాంటిదంటూ..!

Sohail Respect To Suma Bootcut Balaraju Promotions

Sohail Respect To Suma Bootcut Balaraju Promotions

Sohail టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఆమె ఏదైనా షో చేసినా ఈవెంట్ చేసినా అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఈ క్రమంలో సుమ యాంకరింగ్ ఓ సెంటిమెంట్ గా కూడా ఏర్పడింది. స్టార్ సినిమాలకు సుమ యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

ఒక్క ఈవెంట్ కి దాదాపు ఐదు లక్షల దాకా సుమ కోట్ చేస్తుందని తెలుస్తుంది. సుమ యాంకరింగ్ చేస్తేనే ఈవెంట్ కి నిండుతనం వచ్చినట్టుగా చెప్పుకుంటారు.

అయితే సుమ కేవలం కమర్షియల్ అని మాత్రమే ఇన్నాళ్లు అనుకున్నారు కానీ సుమ లోని మంచి తనాన్ని ఎవరు ప్రస్తావించలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ సోహైల్ ఆ విషయాన్ని చెప్పారు. తను నటించి నిర్మించిన బూట్ కట్ బాలరాజు సినిమా ఈవెంట్ కోసం సుమ మేనేజర్ కి కాల్ చేసి సుమక్కతో మాట్లాడాలి అన్నాడట. తను అందరిలా ఈవెంట్ కి అంత ఇచ్చుకోలేనని అన్నారట. దానికి సుమ నీ ఈవెంట్ కి నేను ఫ్రీగా చేస్తానని ఆమె ఈవెంట్ చేశారట.

ఈమధ్యనే సుమ అడ్డాకి వచ్చిన బూట్ కట్ బాలరాజు టీం ఈ షోలో సోహైల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకదు సుమ కాళ్ల మీద పడి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే సుమ దీనికి సమాధానం ఇస్తూ తన కొడుకు హీరోగా మారి ఒక సినిమా చేస్తుంటే అప్పుడు ఆ కష్టాలు అర్ధమయ్యానని అన్నారు.

సోహైల్ హీరోగా నటించడమే కాదు నిర్మాతగా మారి చేసిన ఈ బూట్ కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా లో ముక్కు అవినాష్ కూడా నటించాడు.

Also Read : Prabhas Kalki 2898AD Teaser : హాలీవుడ్ ఈవెంట్ లో కల్కి టీజర్.. రెబల్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ ఇచ్చే అప్డేట్..!